OHR Tank Cleaning : ఓహెచ్ఆర్ ట్యాంక్ క్లినింగ్

TRINETHRAM NEWS

OHR Tank Cleaning : డిండి (గుండ్లపల్లి) మార్చ్ 11, త్రినేత్రం న్యూస్. డిండి మండలం ఎర్రారం గ్రామ పంచాయతీ పరిధిలోని కామధేను గౌరారం గ్రామంలో ప్రజలకు స్వచ్ఛమైన, పరిశుభ్రమైన తాగు నీటిని అందించాలని ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం సర్పంచ్ బొడ్డుపల్లి వరసాల లక్ష్మయ్య,గ్రామ వార్డు సభ్యులు దర్శనం విష్ణు లు గ్రామ పంచాయతీ సిబ్బందితో ఓ హెచ్ ఆర్ ట్యాంక్ ను క్లినింగ్ చేయించారు.

ప్రజలు రోగాల బారిన పడకుండా ఎప్పటికప్పుడు నీటిని తొలగించి,ట్యాంక్ క్లినింగ్ చేసి, బ్లీచింగ్ పౌడర్ వేసి ఉంచాలని,పారిశుధ్య పనులు చేయాలని ఈ సందర్బంగా సిబ్బందికి తెలిపారు.ప్రజా పాలనలో ప్రజల అవసరాల కనుగుణంగా పాలన సాగుతుందని వారు అన్నారు.

OHR Tank Cleaning

You cannot copy content of this page

Scroll to Top