వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్… ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేయూత నందించడం ద్వారా విద్యార్థులు విద్యను అభ్యసించడానికి సులువు అవుతుందని రిటైర్ట్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పురుషోత్తమ శాస్త్రి అన్నారు. సోమవారం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల- ధన్నారంలో నిర్వహించిన సమావేశంలో సిద్దులూరు కాంప్లెక్స్ లోని అన్ని పాఠశాలల విద్యార్థులకు ప్లేట్స్ వితరణ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సొంత సమాజసేవ చేయాలని అన్నారు. విద్యార్థులు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొని లక్య సాధనకై పట్టుదలతో చదుకోవాలని విద్యార్థులకు సూచించారు.ప్రతి ఒక్కరు కొంతైనా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని అలవరుచుకోవాలని సిద్దులూరు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పిఆర్ టి యు టిఎస్ వికారాబాద్ మండల అధ్యక్షులు శ్రీనివాస్,ధన్నారం సిద్దులూరు,కొటాలగూడ ,శ్రీరాంనగర్,పులుసుమామిడి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అన్వరుద్దీన్ , కిష్టారెడ్డి ,వెంకట్ రెడ్డి,చంద్రయ్య , నర్సింహ చారి, ఉపాధ్యాయులు శ్రీదేవి, శ్రీలత,విజయనిర్మల,వంశీ కృష్ణ, విమలమ్మ, తులసి, మురళీ,నేహా, నరేష్,దశరథ్ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


