ఏ.పీ.ఈ.ఆర్.సి ఆధ్వర్యంలో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
బాపట్ల డి ఈ జి ఆంజనేయులు
ఏ.పీ.ఈ.ఆర్.సి ఆధ్వర్యంలో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. బాపట్ల డి ఈ జి ఆంజనేయులు ఈ సందర్భంగా వారు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ సం” 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవసరాలు రిటైల్ ధరలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణను జనవరి 29న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన విద్యుత్ సర్కిల్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే పట్టణంలోని బాపట్ల డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నరు. ప్రజాభిప్రాయ సేకరణలో విద్యుత్ వినియోగదారులందరూ పాల్గొని తమ అభిప్రాయాలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి వారికి తెలియజేయవలసిందిగా కోరుచున్నారు. ప్రజా అభిప్రాయ సేకరణ జనవరి 29 నుంచి జనవరి 31 తేదీ వరకు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగునని బాపట్ల డి.ఈ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు.