Holiday Tomorrow : రేపు సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్

TRINETHRAM NEWS

Trinethram News : Telangana : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్దం అవుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. రేపటి (బుధవారం) పోలింగ్ రోజును సెలవుగా ప్రకటించింది సర్కార్.

ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు మాత్రమే ఈ సెలవు వర్తించనుంది. కాగా, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరుగనుంది.

మొత్తం 12,930 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రేపు (ఫిబ్రవరి 11) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Telangana government declares holiday tomorrow

You cannot copy content of this page

Scroll to Top