CMRF in Distress : ఆపదలో ఆపద్బాంధవు సీఎంఆర్ఎఫ్

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు చింతల్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతూ ముఖ్యమంత్రి సహాయనిధికై దరఖాస్తు చేసుకున్న ఇద్దరూ ముఖ్యమంత్రి సహాయనిది లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు, నాయకుల చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఎల్ఓసి పత్రాలను అందజేశారు.

ఎల్వోసి పత్రాల పంపిణీలో భాగంగా నిజాంపేట్ ప్రాంతానికి చెందిన సిహెచ్ శ్రీనివాస్ తండ్రి నాగయ్య (2.00 లక్షలు) మంజూరు కాగా, రంగారెడ్డి నగర్ డివిజన్ కు చెందిన కడియాల ఆనంద్ కుమార్ తండ్రి మాధవ్ (2.00 లక్షలు) మంజురయ్యాయి.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయ శేఖర్ గౌడ్, నిజాంపేట్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, నిజాంపేట్ సర్కిల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, నాయకులు సుధాకర్, కార్తీక్ గౌడ్, ఎర్వ సాయికిరణ్ (బంటి), తేజ యాదవ్, సత్యనారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CMRF in distress

You cannot copy content of this page

Scroll to Top