డిండి గుండ్ల పల్లి జనవరి 18 త్రినేత్రం న్యూస్. డిండి గ్రామ సర్పంచ్ నల్లగంతుల రవి అధ్యక్షతన ఆదివారం మండలకేంద్రంలో లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో డిండి భవిష్యత్తు అనే అంశంపై స్థానిక ఈ.జే ఫంక్షన్ హాలులో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో భాగంగా గ్రామ పెద్దలు కులమతాలకు, పార్టీలకు అతీతంగా విచ్చేసి వారి వారి అభిప్రాయాలను తెలియ జేశారు. అనంతరం గ్రామ ప్రజలు అందరూ కలిసి ఒక జే.ఏ.సి ని ఏర్పాటు చేసుకుని తద్వారా కార్యచరణ అనేది ముందుకుతీసుకెళ్లాలని నిర్ణయించుకోవడం జరిగింది.
డిండి గ్రామాన్ని 100 కిలోమీటర్ల దూరం ఉన్న నల్గొండ జిల్లా నుండి దగ్గర్లో ఉండే జిల్లాలో విలీనం అయ్యేందుకు అందరం ఏకతాటిపై నిలవాలని నిర్ణయించుకోవడం జరిగింది. దీనికోసం ఉద్యమం సైతం చేయడానికి గ్రామ ప్రజలు సిద్ధంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ నల్లగంతుల రవి, ఉపసర్పంచ్ కౌసర్ రషీద్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు , యువ జననాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


