సర్దార్ వల్లభాయ్ పటేల్ అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన:మెడబలిమి వెంకటేశ్వరరావు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం:విజయవాడలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆంధ్రరత్న భవన్ నందు సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో ఏపీసీసీ సభ్యులు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మెడబలిమి వెంకటేశ్వరరావు పాల్గొని ఆ మహనీయులకు ఘనమైన నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులు భరతమాత ముద్దుబిడ్డ రాజ్యాంగ హక్కుల కమిటీ చైర్మన్ భారతరత్న దివంగత కాంగ్రెస్ నేత సర్దార్ వల్లభాయ్ పటేల్ 73 వ వర్ధంతి భారత దేశపు ఉక్కు మనిషిగా పేరు గాంచిన సర్దార్ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులని స్వాతంత్ర్యం లభించిన తరువాత అనేక సంస్థానాలను దేశంలో విలీనం చేయడానికి కృషి చేసిన వారిలో ప్రముఖులని మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మంత్రి మండలిలో హోమ్ మంత్రి ఉప ప్రధాని పదవులు 1931లో కరాచీలో జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షునిగా ఎన్నికయ్యారని దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక రాజ్యాంగ రచనకు ఏర్పడిన కమిటీకి సహకారం అందించారని భారత ప్రభుత్వం దివంగత కాంగ్రెస్ నేత సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను గుర్తించి భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్నం బిరుదును ప్రకటించిందని పేర్కొన్నారు.అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు 71 వర్ధంతి ఆంధ్ర రాష్ట్రంకోసం పోరాడిన వారిలో శ్రీరాములు అగ్రగణ్యులని గాంధీజీ నాయకత్వంలో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణకై మద్రాసులో ని బులుసు సాంబమూర్తి గృహంలో 1952 అక్టోబర్ 19న శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ఆరంభించి 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిందని ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సాధనలో 1952 డిసెంబర్ 15 రాత్రి ఆశయం నెరవేరకుండానే ప్రాణత్యాగం చేసి అమరజీవి అయ్యారని ఆవేదన చెందారు.త్యాగ బుద్ధి అలవర్చుకోవడమే మనం వారికిచ్చే నీరాజనం ఆ త్యాగజీవి కి.శే.పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం ఫలితంగా మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కొండేపి నియోజకవర్గ సమన్వయ కమిటీ మెంబర్ బొడ్డు సతీష్ యువజన కాంగ్రెస్ నాయకులు కైపు వెంకటకృష్ణారెడ్డి మహిళా నాయకురాలు సునీత తదితరులు పాల్గొన్నారు.