Heavy Security Arrangements : రెండోవ విడత పంచాయితీ ఎన్నికలకు భారీ బందోబస్తు

TRINETHRAM NEWS

రామగుండం పోలీస్ కమీషనరేట్తే ది:. 13-12-2025

శాంతియుత ఎన్నికల నిర్వహణే లక్ష్యం: రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా

రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ లలో రెండో విడుత గ్రామపంచాయతీ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు నిర్వహించడం జరిగిందని ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ పరిధిలో రెండోవ విడుత పాలకుర్తి , అంతర్గం , జూలపల్లి , ధర్మారం 04 మండలాలలో 73… గ్రామపంచాయతీలు .97.. పోలింగ్ కేంద్రాలలో, .684.. పోలింగ్ లొకేషన్స్, మంచిర్యాల జోన్ పరిధిలో .. బెల్లంపల్లి , కన్నేపల్లి , భీమిని, తాండూర్, నేన్నెల, కాసిపేట్, వేమనపల్లి 07 మండలాలలో..114. గ్రామపంచాయతీలు,112…. పోలింగ్ కేంద్రాలలో,724 పోలింగ్ లొకేషన్స్. మొత్తం రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిధి లో 1680… మొత్తం పోలింగ్ కేంద్రాలలో సాధారణ పోలింగ్ కేంద్రాలు-1161…., క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు-..519 కలవు.

రెండో విడుత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు

డీసీపీ – 02 , ఏసీపీ – 07, సీఐలు – 30, ఎస్‌ఐలు – 95, ఏఎస్‌ఐలు/హెడ్ కానిస్టేబుళ్లు– 270, కానిస్టేబుళ్లు – 520, హోం గార్డులు – 240, ఆర్ముడ్ సిబ్బంది –190, QRT టీమ్స్ – 32,
రూట్ మొబైల్ పార్టీలు – 62, మిగతా సిబ్బంది, సుమారు 200, మొత్తంగా సుమారు 1700 మంది పోలీస్ మరియు భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.

కమిషనరేట్ పరిధిలో రెండో విడుత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. అనుమానిత వ్యక్తులను బైండోవర్ చేశాం. చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేశాం. ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే, స్థానిక పోలీస్, డయల్ 100కు సమాచారం ఇవ్వాలి. ప్రజలు ప్రశాంత వాతావర ణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి అని సీపీ తెలిపారు. పోలీస్ సిబ్బందితో రూట్ మొబైల్స్, స్ట్రెకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రెకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కమీషనరేట్ లో ప్రశాంత వాతావరణం లో ఎన్నికలు నిర్వహించుటకు క్రిటికల్ పోలింగ్ గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహించి ఎన్నికలపై ప్రజల్లో భరోసా కల్పించడం జరిగిందని సీపీ అన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Heavy security arrangements for tPanchayat elections

You cannot copy content of this page

Scroll to Top