TRINETHRAM NEWS

ఘన ద్రవ వ్యర్ధాలు లేని గ్రామాల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం కలెక్టర్ ప్రసన్న వెంకటేష్

పైలట్ ప్రాజెక్టు గ్రామాలుగా దెందులూరు, కైకలూరు, భీమడోలు, దొరమామిడి, మోర్సపూడి పంచాయతీలు ఎంపిక
ప్రభుత్వ సలహాదారు సి.శ్రీనివాసన్ సేవలతో గ్రామాలలో డంపింగ్ యార్డులకు శాశ్వత పరిష్కారం

ఏలూరు : ప్రజల సహకారంతో పల్లెల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు.పారిశుధ్య రహిత గ్రామాలుగా ఎంపిక కాబడిన గ్రామ పంచాయతీల సర్పంచులకు, ఎంపీడీఓలకు పంచాయతీ కార్యదర్సులకు, వార్డు సభ్యులకు ఒకరోజు వర్క్ షాప్ జిల్లా కలక్టరేట్ ప్రాంగణం లో గోదావరి మీటింగ్ హాలులో బుధవారం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సలహా దారుడు, ఇండియన్ గ్రీన్ ఫోర్స్ కోఆర్డినేటర్ సి. శ్రీనివాసన్ నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీనివాసన్ చెత్త ద్వారా సంపదను సృష్టించవచ్చని పలు ఆసక్తికర అంశాలు వివరించారు. సమాజంలో వ్యర్ధాలను అందరు నిరుపయోగంగా వదిలేస్తున్నా మని, అసలు నిరుపయోగం అనే వస్తువు అంటూ సమాజంలో ఏదీ లేదని అన్నారు. అవగాహన లేకపోవడం వలన గ్రామాలలో, పట్టణాలలో చెత్తతో సమస్యలు ఎదుర్కొటున్నామని, అలాకాకుండా తడిచెత్త, పొడిచెత్త ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేసి ప్రకృతి వ్యవసాయం దిశగా సమాజాన్ని ప్రోత్సహిస్తే సంపద సృష్టితో పాటు ఆరోగ్య వంతమైన సమాజం వైపు అడుగులు వేయవచ్చని అన్నారు. నిధులు కొరతను ఎదుర్కుంటున్న గ్రామ పంచాయతీలు సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మానేజ్మెంట్ కాన్సెప్ట్ తో ఆర్ధిక పరిపుష్టి సాధించవచ్చని శ్రీనివాసన్ గణాంకాలతో వివరించారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా దెందులూరు, కైకలూరు, భీమడోలు, దొరమామిడి, మోర్సపూడి గ్రామాలు ఎంపిక చేశామని, సర్పంచులు ప్రజా ప్రతినిధులు సహకారంతో చెత్త రహిత గ్రామాలుగా వీటిని తీర్చిదిద్దాలని అన్నారు. ప్రజలు ఎదుర్కుంటున్న అతిపెద్ద సమస్య గ్రామాలలో పారిశుద్యమని, ప్రజల ఆలోచన శైలి మారితే పారిశుధ్య నిర్వహణ కష్టతరం కాదని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. కార్యక్రమానికి జిల్లా జిల్లా గ్రామ పంచాయతీ అధికారి శ్రీనివాస విశ్వనాధ్ అధ్యక్షత వహించగా జడ్పీ సీఈఓ సుబ్బారావు, ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ రాజ్, సీనియర్ ఇంజనీర్ గ్రామీణ నీటి సరఫరా సత్యనారాయణ, డీపీఆర్సీ కోఆర్డినేటర్ ప్రెసంగి రాజు, సర్పంచులు పాముల సునీత, మేరీ నవరత్న కుమారి ఎంపీడీఓలు వెన్న శ్రీలత, ఎన్ ఉమామహేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.