Tummala Suresh Yadav : స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టనున్నారు

TRINETHRAM NEWS

కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం అని విశ్వసిస్తున్న ప్రజలు
-పట్లూర్ మాజీ టిఆర్ఎస్ పార్టీ వార్డ్ మెంబర్ కాంగ్రెస్ లో చేరిక
-కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల సురేష్ యాదవ్

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో మండలంలో అభివృద్ధి వేగవంతం అవుతుండడంతో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీతోని అభివృద్ధి సాధ్యమైతుందని నమ్మకంతో పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల సురేష్ యాదవ్ పార్టీ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని పట్లూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్లూర్ టిఆర్ఎస్ పార్టీ మాజీ వార్డ్ మెంబర్ ఖాజా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అభివృద్ధి గురించి ప్రజలకు వివరించి ఓటు అడగాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి పరశురాం, మహేష్ మొరంగపల్లి సురేష్,రాకేష్, రాజు , నందు షోకత్,తప్ప అజీజ్, అఖిల్, సంగన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Congress party will be crowned in the local elections

You cannot copy content of this page

Scroll to Top