MMC జోన్ కమిటీ ప్రతినిధి “అనంత్” పేరిట లేఖ
Trinethram News : జగిత్యాల: మావోయిస్టులు సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. మహారాష్ట్ర–మధ్యప్రదేశ్–ఛత్తీస్‌గఢ్ (MMC) జోన్ కమitee ప్రతినిధి “అనంత్” పేరిట విడుదలైన లేఖలో 2026 జనవరి 1వ తేదీ నుంచి సాయుధ పోరాటాన్ని విరమించుకుంటామని స్పష్టం చేశారు.
ప్రస్తుతం తమ వద్ద ఉన్న ఆయుధాలను అప్పగించి, ప్రజాహిత పునరావాస కార్యక్రమానికి అంగీకరిస్తామని లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రక్రియ శాంతియుతంగా జరిగేందుకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
సాయుధ కార్యకలాపాల నుంచి సామాజిక జీవితంలోకి తిరిగి రావడానికి కొంత సమయం అవసరమని పేర్కొంటూ, ఈ మేరకు గురువారం లేఖ రాసినట్టు తెలిపారు. అంతకుముందు జరిగిన ఎన్‌కౌంటర్లలో తమ అగ్రనేతలు మల్లేశ్, ఆశు లాంగబాబు, ద్వాజ మృతిచెందినట్టు లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ, ప్రభుత్వ విధానాలే ఈ పరిస్థితికి కారణమని ఆరోపించారు.
అలాగే, కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరుతూ, తమ నిర్ణయానికి కేంద్ర కమిటీ ఆమోదం ఉన్నట్టు లేఖలో వెల్లడించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


