CPI : ప్రజల కోసం పోరాడింది,పోరాడేది సిపిఐ పార్టీనే

TRINETHRAM NEWS

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్య పద్మ.

Trinethram News : భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బస్సు ప్రచార జాత నేడు వివిధ జిల్లాలను ముగించుకొని జగద్గిరిగుట్ట గిరి నగర్ షాపూర్ నగర్ కి రావడం జరిగింది.
ఈ జాతకు భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్యపద్మ ఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలివుడ్ల ఖాద్రి ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు ఉప్పలయ్య రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి డీజే నరేంద్ర ప్రసాద్ లు పాల్గొనగా సిపిఐ పార్టీ కుత్బుల్లాపూర్ మండల సమితి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి జగద్గిరిగుట్ట గిరి నగర్ షాపూర్ నగర్లలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పశ్య పద్మ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా శుద్ధ జయంతి ఉత్సవాలను నిర్వహించుకుని ఖమ్మంలో లక్షలాదిమంది ప్రజలతో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఆ బహిరంగ సభను జయప్రదం చేయడానికి కోసం రాష్ట్రవ్యాప్తంగా జాతాలను నిర్వహిస్తూ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పోరాటాలను ప్రజలకు తెలియజేస్తూ కమ్యూనిస్టు పార్టీ నిర్వహించినటువంటి సాయుధ పోరాటం దానివల్ల 3000 గ్రామాలను విముక్తి చేయడం 10 లక్షల ఎకరాలను పేద ప్రజలకు పంచిన చరిత్ర కేవలం కమ్యూనిస్టు పార్టీకి మాత్రమే ఉన్నదని అన్నారు. అదేవిధంగా మేడ్చల్ జిల్లాలో భూ పోరాటాలు నిర్వహించి వందలాది ఎకరాలను లక్షలాదిమంది ప్రజలకు 60 గజాల భూములను ఇచ్చి ఇండ్లు స్థలాలు లేని వారికి ఇండ్ల స్థలాలను ఇప్పించినటువంటి చరిత్ర కేవలం కమ్యూనిస్టు పార్టీకే దక్కిందని, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం నిత్యం పోరాటం చేస్తూ ప్రజా సమస్యలను తీర్చడంలో పెద్దన్న పాత్ర వహించుతూ నేటికీ 100 సంవత్సరాలుగా ప్రజల గుండెల్లో జీవిస్తూ ప్రజల సమస్యలను తీర్చేది కేవలం కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని అందుకే ఈ దేశంలో కమ్యూనిజం ఏ ప్రత్యామ్నాయమని అన్నారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ సమితి సభ్యులు ఎండి యూసుఫ్ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో గుబురు గుట్ట గిరి నగర్ మగ్దమ్ నగర్ భగత్ సింగ్ మార్క్ రావి నారాయణరెడ్డి నగర్ లెనిన్ నగర్ శ్రీనివాస్ నగర్ లాంటి అనేక కాలనీలను ఏర్పాటు చేసిన ఘనత స్థానిక సిపిఐ నాయకత్వానికి ఉందని అదేవిధంగా దుండిగల్ మండలంలో 600 ఎకరాలను రైతులకు పంచి కుత్బుల్లాపూర్ లో పేద ప్రజల కోసం పోరాటం చేసినటువంటి అసెంబ్లీ సీసాలు అయినటువంటి పార్టీ సిపిఐ పార్టీ అని అదేవిధంగా నేడు ప్రజలు కావలసినటువంటి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ హాస్పిటల్, జగద్గిరిగుట్టలో ఆర్టీసీ బస్ డిపో, బస్తి దావకాన, భవనిర్మాణ కార్మికులకు 250 గజాల స్థలం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారని కావున ప్రజలు దీన్ని గుర్తించి రాబోవు రోజుల్లో సిపిఐ నీ ఆదరించాలని కోరారు.
ఈ కార్యక్రమాలకు సిపిఐ మండల కార్యదర్శి అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు హరినాథ్ రావ్ ,శ్రీనివాస్, సీనియర్ నాయకులు యేసు రత్నం, వెంకటేష్, ప్రజానాట్యమండలి అధ్యక్షులు ప్రవీణ్, బాబు, మహిళా సమైక్య అధ్యక్షురాలు హైమావతి,సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు నరసింహారెడ్డి,సదానంద్, సహదేవ రెడ్డి,వెంకటేష్, దుర్గయ్య, సీనియర్ జర్నలిస్టు డప్పు రామస్వామి,నరసయ్య ,వీరస్వామి, సామెల్, కీర్తి ,శ్రీనివాస్ ,చారి ,వెంకటాచారి, బాలరాజు , ఇమామ్,జార్జ్, బక్కరి మల్లేష్ కే శ్రీనివాస్ మహేందర్ కనకయ్య చంద్రకాంత్ అల్లాతో పాటు వందలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ జాతాకు సిపిఎం మండల కార్యదర్శి కే లక్ష్మణ్ నేతృత్వంలో సిపిఎం మరియు సిఐటి నాయకులు స్వాగతం పలికి శాలువలతో సత్కరించడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The CPI party fought for the people and is fighting for them

You cannot copy content of this page

Scroll to Top