National Education Day : ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ బాలికలలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, స్థానిక ప్రజాప్రతినిధులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు.ఈసందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీకి అయిదు ఎకరాల స్థలం కేటాయిస్తున్నాం, స్వంత భవనం నిర్మాణానికి అవసరమైన నిధులు కూడా మంజూరు చేయిస్తాను.

స్వాతంత్ర్య సమరయోధుడు, స్వతంత్ర భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి, భారతరత్న, స్వర్గీయ మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటున్న నేషనల్ ఎడ్యుకేషన్ డే కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు,తల్లిదండ్రులకు నా శుభాకాంక్షలు.అదేవిధంగా ఈరోజు జరుగుతున్న మైనారిటీ వెల్ఫేర్ డే కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ నా అభినందనలు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ దేశ విద్యా విదాన రూపకల్పనలో క్రియాశీలంగా పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

National Education Day in full swing

You cannot copy content of this page

Scroll to Top