దేవరకొండ డివిజన్ నవంబర్ 11 త్రినేత్రం న్యూస్. చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామంలో చిత్రియాల సహకార సంఘం బ్యాంకు అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పి ఏ సీ ఎస్ అధ్యక్షులు మరియు కార్యదర్శులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాలే నరసింహారెడ్డి పీసీసీ సభ్యులు పి ఎ సీ ఎస్ *చైర్మన్ పాల్గొన్నారు.
ఆయన ఈ సంద్భంగా మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ పంట రైతులకు ఆర్థికంగా లాభదాయకమని తెలిపారు.. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని,నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో ఈ పంట విస్తరణకు రైతులు ముందుకు రావాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు వెంకటయ్య, మాజీ ఉప సర్పంచ్ యాదయ్య, బోయపల్లి రాములు గౌడ్, సుగూరి పెద్ద రాములు, సత్తిరెడ్డి, దేవుని అంకుల్, వెంకటాచారీ, బందేల తిరుపతయ్య, పోలగొని వెంకటయ్య, కొప్పుల బిక్షమయ్యతదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


