వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా షేక్‌పేట్ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా పరిగి ఎమ్మెల్యే మరియుడిసిసి అధ్యక్షులు డాక్టర్.టి.రామ్మోహన్ రెడ్డి, విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ,స్థానిక కాంగ్రెస్ నాయకులు,పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో కలిసి పాదయాత్ర, ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ప్రజలతో ముఖాముఖీగా మాట్లాడి,ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలను వివరించారు.కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించి,హైదరాబాద్ అభివృద్ధికి బలం చేకూర్చాలని ప్రజలను ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి, కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


