అధ్యక్షులుగా గుర్రాల చంద్రశేఖర్..!
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని లోని ముదిరాజ్ కులస్తుల ఇలవేల్పు శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం& నాగదేవత ఆలయం నూతన కమిటీని బుధవారం ఆలయ ప్రాంగణంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండు సంవత్సరాల కాలపరిమితితో నూతన అధ్యక్షులుగా(చైర్మన్) గుర్రాల చంద్రశేఖర్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా(వైస్ చైర్మన్) రావుల స్వరాజ్ ముదిరాజ్, కోశాధికారి(ట్రెజరర్)గా బండి రాజేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి సంక్షేమం కొరకు ముదిరాజ్ కులస్తులకు విస్తృతంగా ప్రచారం చేసి అమ్మవారి కృపకు పాత్రులు అయ్యే విధంగా కృషి చేయాలని నిర్ణయించారు. అలాగే ఆలయ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అధ్యక్షులుగా మనాలి రాజ్ ఠాకూర్ ఎన్నుకున్నారు.
సభ్యులుగా సబ్బు మల్లయ్య, అప్పరాజు ప్రభాకర్, ఈర్ల రాజయ్య, నరెడ్ల రాజశేఖర్, జోడు కిష్టయ్య, అనవేన నర్సయ్య, బర్ల మల్లయ్య, బోలవేన సాంబయ్య, బొజ్జ ఉప్పలయ్య, తౌఢవేన రాజయ్య, పిట్టల ఇస్తారి, పిట్టల శంకరయ్య, బొల్లి రవికుమార్, శీలం శ్రీనివాస్, ఓదెల రామస్వామి, పిడుగు కృష్ణ ముదిరాజ్, గైక్వాడి రజనీకాంత్, తూడి రాజయ్య, పిట్టల అంజయ్య, బొల్లి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


