Trinethram News : Oct 08, 2025, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలంతా స్వదేశీ వస్తువులను స్వీకరించి, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం నవీ ముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. స్వదేశీ వస్తువుల వాడకం వల్ల దేశంలో అభివృద్ధి వేగవంతం కావడమే కాకుండా యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. గత యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత పాకిస్థాన్‌పై ఎందుకు దాడి చేయలేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వానికి దేశభద్రతే అత్యంత ప్రధానమని, ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్థాన్‌కు గట్టి సమాధానం ఇచ్చామని గుర్తుచేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


