త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మండలం అనంతరంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ లో పనిచేస్తున్న డైలీ వేజ్, కంటింజెన్సీ వర్కర్ల సమస్యల పరిష్కారానికై జరుగుతున్న సమ్మెకు అశ్వారావుపేట మండల బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు.ఈ సందర్బంగా బిఆర్ఎస్ నాయుకులు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు 26400 /- వేల రూపాయలు వేతనం చెల్లించేవారని, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కనీస వేతనం నుండి కోతలు విధించడం చాలా దుర్మార్గపు చర్య అని అన్నారు. ఇప్పుడు కనీస వేతనానికి 11000 /- వేలకు కుదించడం సరైనది కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే ఈ డైలీ వేజ్ వర్కర్లు సమ్మె మొదలు పెట్టి 6 రోజులు అవుతున్న కనీసం స్పందించక పోవటం చాలా బాధాకరమైన విషయం అని, విద్య వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని నీతి మాటలు చెప్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లలకి వండి పెట్టే వారు సమ్మెలు నిర్వహిస్తే పిల్లలకు అన్నం వండి పెట్టేది ఎలా సమయానికి పిల్లలకి భోజనం ఎలా సమయానికి అందుతుందనేది ఆలోచనచేయక పోవడం కూడా ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని అన్నారు. తక్షణమే ప్రభుత్వం డైలీ వేజ్ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి జీవో నం.64 నీ ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే వర్కర్లు మాట్లాడుతూ ఉదయం 4 గంటలకు వచ్చి, సాయత్రం వరకు పిల్లల బాగోగులు చూసుకుంటూ నిరంతరం హాస్టల్స్ లోనే గడిపే వర్కర్ల కష్టాన్ని గుర్తించి న్యాయ సమస్యలని పరిష్కరించాలని బిఆర్ఎస్ నాయకులు కోరారు. అలాగే ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న నాయకులు పేపర్లలో ఫోటోలకు పోజులివ్వటం డిల్లీ పెద్దలను మెప్పించడానికి సరిపోతుందని, ప్రజల కష్టాలను గాలికి వదిలేస్తున్నారని, రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి యూస్. ప్రకాష్ రావు, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, బరగడ కృష్ణ, నియోజక వర్గ నాయకురాలు వగ్గేల పూజ, మండల నాయకులు మందపాటి రాజా మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ నారం రాజశేఖర్, అశ్వారావుపేట టౌన్ పార్టీ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ, జుజ్జురపు శ్రీరామమూర్తి, అనంతారం పార్టీ నాయకులు ఈదర రాంబాబు, మాజీ ఎంపీటీసీ పద్దం శ్రీను, మలోతు రామారావు, నవీన్, హరికృష్ణ, అమీర్, వేజ్ వర్కర్లు జెట్టి వెంకటేశ్వరరావు, జెట్టి సత్యం, మడివి వెంకటేశ్వరరావు, భూక్యా లక్ష్మీ, కారం బద్రమ్మ, తోట సీత, బుగ్గ రామ్భాయ్, వెట్టి మంగ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


