పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సమూహ జిల్లా కార్యాలయాల సముదాయం(IDOC), పెద్దపల్లి ప్రాంగణంలో ఉన్న వేంకటేశ్వర వారి దేవాలయ కల్యాణ మండపంలో ఈ సంవత్సరం వినాయక చతుర్ధి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుటకు మన ఉద్యోగ గణనాథుడిని టి.ఎన్.జి.వో. ల ఆధ్వర్యంలో సమస్త జిల్లా ఉద్యోగుల పక్షాన టి.ఎన్.జి.వో. సంఘం – పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మరియు ఉద్యోగ, ఉపాధ్యాయుల జే.ఏ.సీ. ఛైర్మన్ , ఆలయ సంఘం ఛైర్మన్ బొంకూరి శంకర్ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించడం జరిగింది. బుధవారం మొదటి రోజు పూజకు పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న దాసరి వేణు సమేతంగా విచ్చేసి పూజలో భాగస్వామ్యులు కావడం జరిగింది.
వారితో పాటు టి.ఎన్.జి.వో. సంఘం – పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మరియు ఉద్యోగ, ఉపాధ్యాయుల జే.ఏ.సీ. ఛైర్మన్ , ఆలయ సంఘం ఛైర్మన్ శ్రీ బొంకూరి శంకర్ దంపతులు, వారి కార్యదర్శి పిస్క సత్యనారాయణ దంపతులు ఈ రోజు పూజలో భాగస్వామ్యులు కావడం జరిగింది. ఆలయ ఆస్థాన అర్చకులు రంగాచార్యులు ఈ పూజను ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో టి.ఎన్.జి.వో. ల పట్టణ అధ్యక్షులు అయిరెడ్డి సందీప్ రెడ్డి ఆలయ కోశాధికారి శ్రీకాంత్ సరిత , రాజ్ కుమార్, జిల్లా పంచాయితీ సెక్రటరీ సంఘం అధ్యక్షులు నుశాంత్ రావు, శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొని విజయవంతం చేసారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


