బస్టాండ్ ఆవరణ చిత్తడిగా మారినా పట్టించుకోని ఆర్ టి సి అధికారులు.
ఆదాయం మీదవున్న శ్రద్ధ ప్రయాణికుల సంక్షేమం మీద లేదా?
డిండి (గుండ్లపల్లి) ఆగష్టు 13 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో ని బస్టాండ్ ఆవరణలో వర్షం పడితే చాలు మొత్తం చిత్తడిగా మారిపోతుందని ప్రయాణికులు వాపోతున్నారు. బస్సులు బయటికి వెళ్లే మార్గం లో బురదమయంగా టైర్లకు బురద అంటుకొని జాతీయ రహదారి అంతా బురదతో నిండిపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు తెలిపారు.
ఆర్ టి సి అధికారులకు ఆదాయం మీదవున్న శ్రద్ధ ప్రయాణికుల సంక్షేమం మీద లేదా అని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక మరమత్తులు చేయకుండా. శాశ్వత పరిష్కారం చేసేవిధంగావెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, మండల ప్రజలు ఆర్ టి సి అధికారుల ను కోరుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


