Collector Koya Sri Harsha : ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూల మాలలు నివాళులర్పించారు

TRINETHRAM NEWS

పెద్దపల్లి, ఆగస్టు 06: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూల మాలలు వేసి కలెక్టర్ నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ జీవిత చరిత్ర సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను జిల్లా ఉన్నతాధికారులు స్మరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని స్టేట్ ఫంక్షన్ లాగా నిర్వహిస్తున్నామని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఆయన చిత్రపట్టానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆచార్య జయశంకర్ పాత్ర మరువలేనిదని, 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, ఉద్యమానికి మార్గదర్శకంగా నిలిచి సలహాదారులుగా పని చేశారని, తెలంగాణ ఉద్యమానికి వెన్నెముకగా ఆచార్య జయశంకర్ నిలిచారని కలెక్టర్ పేర్కొన్నారు
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉందని, స్వరాష్ట్రం సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసారని, రాష్ట్ర అభివృద్ది కొరకు మంచి ప్రణాళికలు సైతం రూపొందించారని , ఆయన ఆశయాల సాధన కోసం మనమంతా సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Acharya Kothapalli Jayashankar birth anniversary

You cannot copy content of this page

Scroll to Top