Crime News : యూట్యూబ్‌లో చూసి భర్తను ఎలా చంపాలో ప్రియుడికి చెప్పిన భార్య

TRINETHRAM NEWS

మద్యం తాగించి..చెవిలో పురుగుల మందు పోసి హత్య చేసిన ప్రియుడు..

అనంతరం భర్త కనబడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

Trinethram News : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో స్వీపర్‌గా పనిచేస్తూ తన భార్య రమాదేవి, ఇరవై ఏళ్ళ వయసు దాటిన కొడుకు, కూతుర్లను పోషిస్తున్న సంపత్(45).. భార్య రమాదేవి సర్వపిండి విక్రయిస్తుండగా, తరచూ ఆమె వద్ద సర్వపిండి కోసం వచ్చి పరిచయం పెంచుకున్న కర్రె రాజయ్య(50).. వీరి పరిచయం వివాహేతర సంబంధంగా మారడంతో ఎలాగైనా సంపత్ అడ్డు తొలగించుకోవాలని యూట్యూబ్‌లో చూసి పథకం వేసిన భార్య రమాదేవి

ఎవరి చెవిలోనైనా గడ్డి మందు పోస్తే చనిపోతారని యూట్యూబ్‌లో చూసి అదే పద్ధతిలో హత్య చేయాలని ప్రియుడికి సూచించిన రమాదేవి.. పార్టీ చేసుకుందామని పిలిచి బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద సంపత్‌తో కలిసి మద్యం సేవించిన రమాదేవి ప్రియుడు రాజయ్య అతని స్నేహితుడు శ్రీనివాస్.. మద్యం మత్తులో తూలుతూ కింద పడిపోగానే చెవిలో గడ్డి మందు పోసి, అతను చనిపోగానే రమాదేవికి ఫోన్ చేసి సంపత్ చనిపోయాడని తెలిపిన రాజయ్య.. మరుసటి రోజు భర్త కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆగస్టు 1వ తేదీన మృతదేహం దొరికిందని తామే పోలీసులకు తెలిపిన రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్

భర్త మృతికి కారణాలు తెలుసుకోకుండా, మృతదేహానికి పోస్టుమార్టం చేయొద్దని అడగడంతో రమాదేవిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. కాల్ డేటా, ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అదుపులోకి తీసుకొని విచారించగా తామే హత్య చేసినట్టు అంగీకరించిన రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్.. దీంతో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించిన పోలీసులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

how to kill husband after watching YouTube

You cannot copy content of this page

Scroll to Top