World Tribal Day : ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ముందు ఆదివాసి హక్కుల కోసం డిమాండ్ల వెల్లువ పొద్దు బల్దేవ్

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా అరకులోయ, ఆగస్టు 05 (త్రినేత్ర న్యూస్) : ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివాసీలకు వందశాతం ఉద్యోగ, ఉపాధ్యాయ రిజర్వేషన్ అమలు చేస్తారని స్పష్టమైన ప్రకటన చేయాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ మేరకు ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ సాధన కమిటీ, ఆదివాసీ నిరుద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీపు జాత ఈరోజు అరకువేలి మండలం పద్మాపురం చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్, నేతలు సత్యనారాయణ, ధర్మన్న, భాను, నాయుడు తదితరులు మాట్లాడుతూ, ఎస్టీలకు ఇచ్చిన వంద శాతం రిజర్వేషన్ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మెగా డిఎస్సీ నుంచి ఏజెన్సీ టీచర్, గురుకుల పోస్టులను మినహాయించాలని, ఏకలవ్య పాఠశాలల్లో స్థానికులతోనే టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. 50% రిజర్వేషన్ వద్దని, షెడ్యూల్ ఏరియాల్లో 100% రిజర్వేషన్ కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాజకుమార్, ఉపసర్పంచ్ భగత్ రామ్, గ్రామ పెద్దలు సన్యాసీ, ఐసుబాబు, రామారావు, రాము, కొండ, శ్రీను, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

World Tribal Day

You cannot copy content of this page

Scroll to Top