Adluri Laxman : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు వినతి పత్రం

TRINETHRAM NEWS

దేవరకొండ జులై 27 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల.,ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనార్టీ హాస్టల్ లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ… ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మంత్రి కీ వినతిపత్రం అందజేయడం జరిగింది.మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్,మండల నాయకులు చీమట శివ,నక్క గణేష్,రాసమల్ల మహేష్,ముత్యాల రామలింగం,ఆర్.అనిల్,ఆర్.చరణ్, పి.మునేష్, బట్టు శివ, తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Adluri Laxman to resolve

You cannot copy content of this page

Scroll to Top