Farmers Protest : నన్ను చంపి నా భూమిలో నుండి రోడ్డు వేయండి

TRINETHRAM NEWS

జాతీయ రహదారి భూసేకరణలో తక్కువ పరిహారం ఇస్తున్నారని, రోడ్డుకోసం భూమి ఇవ్వమని నిరసన తెలిపిన రైతులు..

నిరసన తెలుపుతున్న రైతులను ఈడ్చుకెళ్లిన పోలీసులు

Trinethram News : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామానికి చెందిన కానిగంటి కుమార్ అనే రైతు, జాతీయ రహదారి–563 నిర్మాణం కోసం తన భూమి ఇవ్వనని, మార్కెట్లో ఒక గంటకు రూ.10 లక్షలు ఉండగా అధికారులు కేవలం రూ.63 వేలు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించిన రైతు

భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు తన భూమిలో రహదారి పనులను ప్రారంభించారని, నోటీసులు లేకుండా పనులు ఎలా చేస్తారని అధికారులతో వాగ్వాదానికి దిగి పనులను అడ్డుకున్న రైతు.. దీంతో పోలీసులు కుమార్ ను అరెస్టు చేయగా, పనులు కొనసాగించిన అధికారులు

మానకొండూరు మండలంలోని అనేక గ్రామాల్లో రైతులు తమ భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని, ఇంత తక్కువ పరిహారానికి భూములు ఎలా ఇస్తామని అధికారులను నిలదీస్తున్న రైతులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kill me and build

You cannot copy content of this page

Scroll to Top