Anand Methuku : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసు నమోదు చేయడం దుర్మార్గం. అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడమేనా మీ పాలన ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నందుకే BRS నాయకుల మీద ఇలాంటి కక్ష సాధింపు చర్యలు.
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేతగాక మరియు ప్రభుత్వం మీద ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను తట్టుకోలేక ప్రజల దృష్టి మల్లించటానికి ఇలాంటి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.
ఎన్ని నిర్బంధాలు పెట్టినా, కేసులు నమోదు చేసినా, అరెస్టులు చేసినా ప్రజా సమస్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బేషరతుగా తక్షణం విడుదల చేయాలి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Kaushik Reddy arrested

You cannot copy content of this page

Scroll to Top