Union Day Celebrations : యూనియన్ డే వేడుకలు

TRINETHRAM NEWS

దేవరకొండ జూన్20 త్రినేత్రం న్యూస్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేవరకొండ శాఖ నందు శుక్ర వారం రోజు యూనియన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్ OBC వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు NVT, CM ఫణిదర్ కామ్రేడ్స్ తో కలిసి యూనియన్ ఫ్లాగ్ ఆవిష్కరించి, వై తారక్ నాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. అనంతరం స్కూలు విద్యార్థులకు 80 మందికి స్కూల్ బ్యాగులు పంపిణీ చేసినారు. ఈ సందర్భంగా NVT మాట్లాడుతూ ఎంతోమంది యూనియన్ నాయకుల త్యాగఫలమే ఈరోజు మనము మన హక్కులని సాధించుకుంటున్నామని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్ ఉన్నత స్థాయికి చేర్చిన మహా నాయకుడు చిరస్మరణీయుడు యూనియన్ ఒక బుక్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏర్పాటు చేసిన అమరజీవి అన్న తారక్ నాథ్ అన్న కి ఇవే మా నివాళులు. నేటి తరం నాయకులు వాటినీ అనుసరిస్తే చాలు మన యూనియన్ ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉంటుంది ముందుకు వెళుతుంది అని ఈ సందర్భంగా వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో N పాండు నాయక్,N వెంకటరామ్, చరణ్, శ్రీనివాస్, గోపాలకృష్ణ, శాంతా నాయక్, సాయి కిషోర్, శ్రీనయ్య ,వెంకన్న, మనిషా, స్వాతి , నీరజ, ఖాజా, వెంకట్ ,పవన్ నాయుడు, జయప్రకాష్, సాయి, అనుదీప్, బాలస్వామి, కుమార్, సురేష్, చంద్రబాబు, KVM, వెంకట్, కోటేశ్వరరావు, చక్రపాణి, శ్రీకాంత్, రాజకుమార్, కలమ్మ, ప్రవీణ్, దేవరకొండ, చింతపల్లి, మల్లెపల్లి, నాంపల్లి, గుడిపల్లి, చెరుకుపల్లి ,పులిచెర్ల శాఖల కామ్రేడ్స్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Union Day Celebrations

You cannot copy content of this page

Scroll to Top