Bodrai Pratishtha Mahotsav : బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవంలో కార్యక్రమం

TRINETHRAM NEWS

బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవంలో కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్..

డిండి(గుండ్ల పల్లి) జూన్ 06 త్రినేత్రం న్యూస్. డిండి మండలం సింగరాజుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన తృతీయ బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమానికి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. గ్రామ సంస్కృతికి ప్రతి బింబం నాభిశిల ఉత్సవం అని ఆయన అన్నారు.గ్రామ ప్రజలను సంరక్షించే పొలిమేర దేవతలను ఈ సందర్భంగా పూజించు కోవడం శుభదాయకమని అన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతి రూపం నాభిశిల. వేల సంవత్సరాలుగా గ్రామ నిర్మాణంలో అత్యంత పవిత్రంగా పూజించే ఆది దేవుడి ప్రతి రూపం నాభిశిలని అన్నారు.ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలని ఆయన అన్నారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ని సన్మానించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Program at the Bodrai Pratishtha

You cannot copy content of this page

Scroll to Top