State Formation Day : చెలికాని ఆదెమ్మ ఫంక్షన్ హాల్లో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తరువాత అశ్వారావుపేట నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే జారె

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పట్వారిగూడెం గ్రామంలో చెలికాని ఆదెమ్మ ఫంక్షన్ హాల్ నందు నియోజకవర్గ స్థాయి వేడుకలను స్థానిక శాసనసభ్యులు జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా రాష్ట్ర సాధనకు విశేష కృషి చేసి అసువులు బాసిన అమరవీరులకు నివాళులు అర్పించారు. ఐదు మండలాల అధికారులు వారి వారి పరిధిలో జరిగిన ప్రగతిని ప్రజలకు వివరించారు.

అనంతరం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి అశ్వారావుపేట నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించారు. విద్యా రంగంలో అభివృద్ధిని ప్రస్తావిస్తూ విద్యార్థుల ప్రతిభను మెచ్చుకున్న ఆయన ఉత్తమంగా పనిచేసిన అధికారులు విద్యార్థులను వేదికపై అభినందించి ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విభిన్న సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

State Formation Day celebrations

You cannot copy content of this page

Scroll to Top