Trinethram News : రాష్ట్రంలో గోశాలల ఏర్పాటు, నిర్వహణ, సంరక్షణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కమిటీ ఏర్పాటు చేసి, పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధం చేయాలని, 50 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలు నిర్మించాలని ఆదేశించారు. వెటర్నరీ, అగ్రికల్చర్ యూనివర్సిటీలు, దేవాలయ భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా ఎంకేపల్లిలో గోశాల డిజైన్లను పరిశీలించి, మార్పులు సూచించారు. నాలుగైదు రోజుల్లో తుది మోడల్ ఖరారు కానుంది. సీఎంఓ అధికారులు, ఇతర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


