జూన్ 26, 2026
TRINETHRAM NEWS

డిండి గుండ్లపల్లి) మే25 త్రినేత్రం న్యూస్. ఆదివారం సాయంత్రం 4గంటలు నుండి అచ్చంపేట నుండి హైద్రాబాద్ కు డిండీ గుండా బస్ లేనందువల్ల ప్రయాణికులు 2గంటల సేపు నిరీక్షణ చేయడం జరిగింది. పేరుకే అచ్చంపేట బస్ డిపో , సమయానికి బస్ వేయక పోవడం విడ్డూరం ప్రయాణికుల ఇబ్బంది పట్టించుకోని. ఆర్ టి సి అధికారులు.
జనాభా పెరుగుతున్న కొద్దీ ఆర్టీసీ బస్సులు వేయాల్సింది పోయి అందుకు విరుద్ధంగా బస్ సర్వీసులను తగ్గించి ప్రయాణికుల తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుంది. నిత్యం బస్ సర్వీసులపై ఆధారపడి రాక పోకలు సాగిస్తున్న ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్న ఆర్ టి సి అధికారులు అని ప్రయాణికులు అంటున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు (ఆర్ టి సి) స్పందించి బస్సు సర్వీసుల ను పెంచి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తారని ప్రయాణికులు కోరుతున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bus services or passengers'

You cannot copy content of this page