MLA Kunanneni : టయోటా షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని

TRINETHRAM NEWS

త్రినేత్రం కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని జాతీయ రహదారిలో రాయల్ ఫర్నిచర్ షోరూమ్ ప్రక్కన విద్యానగర్ నందు నూతన కాకతీయ టయోటా కార్ షోరూమ్ ను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టయోటా కంపెనీ వారు నూతన టెక్నాలజీతో రకరకాల కార్లు తయారుచేసి కొత్తగూడెం పాల్వంచ పట్టణ ప్రజలకు ఈ నూతన షో రూమ్ ద్వారా పేద మధ్య తరగతి వారికి అది తక్కువ ధరలకు అందించాలని దృక్పథంతో జిల్లా కేంద్రంలో షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రజలు వారికి నచ్చిన కార్లను కొనుగోలు చేసి టెక్నాలజీకి అనుకూలంగా కార్లను వినియోగించుకోవాలని తెలియజేశారు. ఏ కారునైనా వివిధ ఫైనాన్స్ సంస్థల ద్వారా ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసుకోవచ్చును మరియు తక్షణమే ఎక్స్చేంజ్ సౌకర్యం కూడా కలదు. ఈ కార్యక్రమంలో షోరూం సిబ్బంది కస్టమర్లు వివిధ ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు మరియు కొత్తగూడెం పట్టణ ప్రముఖులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Kunanneni inaugurated Toyota

You cannot copy content of this page

Scroll to Top