త్రినేత్రం న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం : 2025-2026 విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలలో మరిన్ని మెరుగైన వసతుల కల్పనలో భాగంగా గండుగులపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు అందించేందుకు గౌరవ శాసనసభ్యులు జారె ఆదినారాయణ… పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు పాఠశాలల భవనాలు తాగునీటి సౌకర్యం మరుగుదొడ్లు విద్యుత్ వ్యవస్థ పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యను అనుసరించి తరగతి గదుల అవసరం తదితర అంశాలపై సమీక్షించారు. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అశ్వారావుపేట నియోజకవర్గంలోని ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను పొందే విధంగా పాఠశాలల్లో అవసరమైన వసతులను కల్పించడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు విద్యా అభివృద్ధి పథకాల అమలును సమర్థవంతంగా విద్యార్థులకు అందిస్తామని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


