TRINETHRAM NEWS

మైలవరంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను సైతం అంటున్న ముప్పసాని భూలక్ష్మీ

చంద్రబాబుకి మైలవరం ఆసెంబ్లీని బహుమతి గా ఇస్తా

స్థానికురాలిని బి.సి.మహిళనైన నాకు అవకాశం ఇవ్వండి

మైలవరం :బి.సి మహిళనైన నాకు మైలవరం నియోజక వర్గ ఎమ్మెల్యే గా అధినేత చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తే మైలవరం నియోజకవర్గాన్ని గెలిచి బహుమతిగా ఇస్తానని ఇభ్రహింపట్నం 17వ వార్డ్ కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మీ తెలిపారు. తెలుగు పత్రిక ప్రతినిధి తో అమె మాట్లాడుతూ తెలుగు దేశం పార్టిని స్థాపించిన నాటి నుండి తమ కుటుంబం తెలుగు దేశం పార్టీ జండా భుజాన వేసుకున్నామని అన్నారు.తన తల్లిదండ్రులు,అత్త మామలు ఎన్టీఆర్ తెలుగు దేశం స్థాపించిన నాటి నుండి తెలుగు దేశం పార్టీతో ఉన్నారని అన్నారు. ఇభ్రహిం పట్నంలో పార్టీ లతో సంభంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు 17వ వార్డు కౌన్సిలర్ గా గెలిపించారని అన్నారు.
తెలుగు దేశం పార్టి అంటే బి.సిల పార్టీ అన్నారు. బి.సిలే తెలుగు దేశం పార్టికి వెన్నుముక అన్నారు.మైలవరం నియోజకవర్గంలో 50శాతం,యస్సి,యస్టీ లు 20 శాతం వెరసి 70 శాతం ఉన్నారని అన్నారు. స్వాతంత్ర్య వచ్చిన నాటి నుండి అగ్రకులాలు లేదా అగ్రకులలాలకు చెందిన స్థానికేతరులు మైలవరం ఎమ్మెల్యేలు కోనసాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో బి.సిల పార్టిగా ఉన్న పార్టి కేవలం తెలుగు దేశం పార్టి అన్నారు.మైలవరం నియోజక వర్గంలో బి.సిలు అధిక సంఖ్యలో ఉన్నా కేవలం ఓక్క కులానికి మాత్రమే ప్రాధన్యత లభించిందన్నారు.కీర్తి శేషులు స్వర్గీయ నందమూరి తారక రామరావు సైతం బి.సి లను,మహిళలను ప్రోత్సహించడం జరిగిందని గుర్తు చేశారు.మహిళలకు చట్ట సభల్లోను వారికి సముచిత స్థానం కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడుదే అని అన్నారు. మైలవరం నియోజకవర్గంలో మొట్టమొదటి సారిగా బి.సిలకు అందున మహిళనై నాకు సీటు ఇస్తే మైలవరం నియోజకవర్గాన్ని చంద్రబాబుకి కానుకగా ఇస్తానని అన్నారు. పదవి కాంక్షతో సీటు కోరటం లేదన్నారు.మైలవరం నియోజక బి.సి,యస్సి,యస్టి,ఓసి వర్గ లకూ చెందిన సోదరుల ఆకాంక్ష మెరకు ఈ ప్రజలకు మరింత సేవ చేసేందుకే పోటి చేయడం జరుగుతుందన్నారు.తనకు అవకాశం ఇస్తే గెలిచి తెలుగు దేశం పార్టిని మైలవరం నియోజక వర్గంలో పటిష్టపరుస్తానని అన్నారు.సీటు ఇవ్వమని అధిస్థానం దృష్టికి తీసుకెళ్ళామని అన్నారు.
సీట్ అడిగిన తరువాత మీకు కాల్స్ ఏమైన వచ్చాయా అనే ప్రశ్నకు ఆమె స్పదిస్తు కాల్స్ రాకుండా ఎలా ఉంటాయి వస్తాయి కదా అనిచెప్పి, నాకు టీడీపి అన్నా చంద్రబాబు అన్నా అభిమానమని అందుకే టీడీపి పార్టీ నుండి సీట్ అడుగుతున్నాని తెలిపారు.

తగ్గేదిలే ! స్వతంత్ర అభ్యర్థిగా నైన పోటికి సిద్దం

ధన కాంక్షతో రాజకీయాల్లోకి రాలేదని ప్రజల ఆకాంక్ష మేరకు రాజకీయల్లోకి వచ్చామని ప్రజలకు సేవ చేసేందుకైన స్వతంత్ర అభ్యర్ధుగా పోటి సిద్దమని అన్నారు.అధిపత్య దోరణిని సహించేది లేదన్నారు. ధనస్వామ్యనికి,ఆధిపత్య కులాల పెత్తనానికి కాలం చెల్లిందన్నారు.నా బి.సి.యస్సి,యస్టీ సోదరులు ఏక్కువ శాతం ఓ.సిలకు నాకు అండగా ఉన్నారని వారి అభిష్టం మేరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.