May Day : భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మే డే ఉత్సవాలు

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) మే 1 త్రినేత్రం న్యూస్. తేదీ:01.05.2025నాడు డిండి మండల అన్ని గ్రామాలలో భవన నిర్మాణ కార్మిక సంఘం (AITUC) ఆధ్వర్యంలో 139వ. మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా AITUC జిల్లా సహాయ కార్యదర్శి, నూనె వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ…
1920 లో స్వాతంత్రానికి ముందు ఏర్పడినటువంటి సంఘం AITUC నే నాడు 18 గంటల కార్మికుల పనినీ తగ్గించాలని 8 గంటల పని కావాలని ఆనాడు యజమానులకు కార్మికులకు జరిగినటువంటి పోరాటంలో నెత్తురు ఏరులై పారుతుంటే తడిపి ఏర్పాటు చేసుకున్న జెండానే ఈనాడుAITUC కార్మికుల జెండా. ఆనాటి నుండి ఈనాటి వరకు కార్మికుల సమస్యల పరిష్కారానికై కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా కుదించి కార్మికుల పొట్టను కొడుతున్న అన్నారు .
కనీస వేతనం26000 వేలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం,PF, ESI సౌకర్యాలు కల్పించి గ్రామపంచాయతీ కార్మికులను మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేసి గ్రామపంచాయతీ కార్మికులను పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని ,అంగన్వాడి ,ఆశ ,మధ్యాహ్న భోజనం ,స్కీం వర్కర్స్ అందరిని కనీస వేతనం 26,000 ఇవ్వాలని ,అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలి ,ఆటో డ్రైవర్లు,భవన నిర్మాణ కార్మికులకు సహజ మరణం 3లక్షల ఇవ్వాలని ,ప్రమాదవశాత్తు మరణ నికి 10 లక్షల ఇవ్వాలని, కాన్పు, పెళ్లిలకు 1 లక్ష రూపాయలు పెంచాలని,
55 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు 5000 పెన్షన్ ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇస్తూ ,ఇల్లు నిర్మించాలని ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు..
ఈ కార్యక్రమంలో AITUC మండల అధ్యక్షులు భూషిపాక లింగమయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు బూష్పాక సాయిలు, ఎలిమినేటి దేవయ్య, ఏనుక సత్తయ్య ,దాసరి ఆంజనేయులు, హమాలి కార్మిక సంఘం నాయకులు నూక మల్లేష్ , చనమోని మహేష్ బొడ్చర్ల ముత్యాలు, జినుకుంట్ల వెంకటయ్య, రాములు, ఏర్పుల రవి , తోటపల్లి మల్లేష్ ,తోటపల్లి నాగయ్య, ఎలిమినేటి హుస్సేన్ ,చింతకుంట్ల అయోధ్య , వెంకటయ్య ,ముడి శ్రీను ,కొమర శ్రీను, వెంకటేష్ ,ఆలేటి లక్ష్మయ్య ,సుగూరు తిరుపతయ్య, SK నిరంజన్, గ్రామపంచాయతీ కార్మికులు గంగమ్మ, ఈదమ్మ, చెన్నమ్మ, రాములు, దావీదు ,బుడ్డయ్య, బుచ్చయ్య ,వెంకటయ్య ,భారతి ,సుజాత ,గోపి ,గెలమ్మ, సాలమ్మ తదిరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

May Day celebrations were

You cannot copy content of this page

Scroll to Top