Uttam Kumar Reddy : ఎన్‌డీఎస్‌ఏ నివేదిక చూసి సిగ్గుపడండి.. బీఆర్‌ఎస్‌పై ఉత్తమ్ ఆగ్రహం

TRINETHRAM NEWS

హైదరాబాద్, ఏప్రిల్ 25: బీఆర్‌ఎస్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఎన్‌డీసీఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ) ఇచ్చిన నివేదికను చూసి బీఆర్‌ఎస్ నేతలు సిగ్గు పడాలంటూ మండిపడ్డారు. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్పి లక్ష కోట్ల ప్రాజెక్ట్ కట్టారని.. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక చూసి బీఆర్‌ఎస్ సిగ్గుపడాలన్నారు. ‘మీరే డిజైన్ చేశారు.. మీరే కట్టారు.. మీరుండగానే కూలిపోయింది’ అని తెలిపారు. మేడిగడ్డ సుందిళ్ళ నిరుపయోగంగా ఉన్న రికార్డు స్థాయిలో పంటలు పండాయని తెలిపారు. అబద్ధాలు తప్పులపై బతకాలని బీఆర్‌ఎస్ అనుకుంటోందని.. అది కుదరదని స్పష్టం చేశారు. నిర్మాణం చేసిన వాళ్ళు.. చేయించిన వాళ్ళు రైతులకు ద్రోహం చేశారని ఆరోపించారు.

‘ఎన్‌డీఎస్‌ఏ‌ను రేవంత్ రెడ్డినో.. నేనో వేసింది కాదు. దేశంలో బెస్ట్ ఎక్స్‌పర్ట్స్‌ ఎన్‌డీఎస్‌ఏలో ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే ఎన్‌డీఎస్‌ఏ వచ్చింది ’ అని చెప్పుకొచ్చారు. రైతులకు బీఆర్‌ఎస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టుపై అధ్యయం చేస్తామన్నారు. వచ్చే కేబినెట్‌లో ఎన్‌డీఎస్‌ఏపై చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. ఎవడి అయ్య జాగీరు అని కట్టారని ప్రశ్నిస్తూ.. కాళేశ్వరం రైతుల కోసం కాదు జేబులు నింపుకునేందుకు కట్టారు అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Shame on NDSA report

You cannot copy content of this page

Scroll to Top