అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా సంఘాలకు గొప్ప కబురు అందించింది. మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా, ఉపాధి అవకాశాలను పెంచేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించేందుకు జీవో జారీ చేసింది.
మహిళా సంఘాలకు RTC అద్దె బస్సుల కేటాయింపు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు బస్సులను అద్దెకు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. తొలివిడతగా 150 మండల సమాఖ్యలకు 150 RTC అద్దె బస్సులు అందజేయనున్నారు. అనంతరం మిగిలిన మండల సమాఖ్యలకు మరో 450 బస్సులు కేటాయించనున్నట్లు ప్రభుత్వం స్పష్టంచేసింది.
ప్రతి బస్సుకు ప్రభుత్వం నెలకు రూ. 77,220 అద్దె చెల్లించనుంది. అలాగే, మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీ సౌకర్యం కల్పించడంతోపాటు, బస్సుల నిర్వహణకు అవసరమైన మద్దతును కూడా అందజేయనుంది.
ఈ విధానంతో దేశంలోనే తొలిసారి మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ వేదికగా మొదటి విడతలో 50 RTC అద్దె బస్సులను ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
మహిళా సాధికారితకు దారితీసే కొత్త మార్గం ఈ నిర్ణయం ద్వారా పలు ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. మహిళలకు ఆర్థిక స్వావలంబన: బస్సుల నిర్వహణ ద్వారా మహిళా సంఘాలు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.మహిళలకు నూతన ఉపాధి మార్గాలు లభిస్తాయి. సొంత ఆదాయ వనరులు పెంచుకోవడానికి ఇది ఓ గొప్ప అవకాశం.గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే అవకాశం ఉంది. మహిళా సాధికారిత కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం దేశంలోనే ఓ దారిదీపంగా నిలుస్తుంది. మహిళా సంఘాలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసే దిశగా ఇది ముందడుగుగా భావించవచ్చు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


