140 మంది కేజీబీవీ ఉద్యోగుల తొలగింపు
ఆంధ్ర ప్రదేశ్ లో విధులకు హాజరు కాకుండా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో వివిధ కేజీబీవీ విద్యాలయాల్లో పనిచేస్తున్న 140 మంది ఉద్యోగులను విధుల నుంచి తప్పించింది.
వారి స్థానాల్లో కొత్త వారిని నియమించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇటు 211 మంది ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, సిఆర్పీ లకు కూడా అధికారులు షోకజ్ నోటీసులు జారీ చేశారు.