TRINETHRAM NEWS

ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్నపై కేసు!

ఈ నెల 4న వ‌రంగ‌ల్‌లో జ‌రిగిన బీసీ సభ‌

ఈ స‌భ‌లో అగ్ర‌వ‌ర్ణాల‌పై ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న వ్యాఖ్య‌లు

ఆయ‌న‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ స్థానిక నేత‌ల ఫిర్యాదు

దాంతో మ‌ల్ల‌న్న‌పై అల్వాల్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు

Trinethram News : Telangana : కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింత‌పండు న‌వీన్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్నపై అల్వాల్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. ఈ నెల 4న వ‌రంగ‌ల్‌లో జ‌రిగిన బీసీ సభ‌లో ఆయ‌న అగ్ర‌వ‌ర్ణాల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని, చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ స్థానిక నేత‌లు చేసిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన‌ట్లు ఇన్‌స్పెక్ట‌ర్ రాహుల్‌దేవ్ వెల్ల‌డించారు.

ఇక ఇదే సభ‌లో చేసిన వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ పీసీసీ క్ర‌మశిక్ష‌ణా క‌మిటీ ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్నకు గురువారం నాడు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం బీసీ కుల గ‌ణ‌న స‌ర్వే నివేదిక‌ను అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టిన విష‌యం తెలిసిందే.

అయితే, ఈ స‌ర్వేలో బీసీల సంఖ్య‌ను త‌క్కువ చేసి చూపించారంటూ ఆయ‌న సొంత పార్టీ స‌ర్కార్‌పైనే తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌ల్ల‌న్న చేసిన వ్యాఖ్య‌లు కాంగ్రెస్‌ను తీవ్ర విమ‌ర్శ‌ల‌పాలు చేసింది. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాలు బీసీ జ‌నాభా త‌గ్గ‌డంపై క‌న్నెర్ర చేస్తున్నాయి. దాంతో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ కోరుతూ టీపీసీసీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tinmar Mallanna