![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-07-at-18.53.39.jpeg)
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 7: కుల గణన మరియు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పై కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని స్వాగతిస్తూ,తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి సలీం ఆధ్వర్యంలో లోకసభ ప్రతిపక్ష నాయకులు ఎంపీ రాహుల్ గాంధీ,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,మంత్రులు దామోదర రాజనర్సింహ,ఉత్తమ్ కుమార్ రెడ్డి,మరియు పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటాలకి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమానికి జనరల్ సెక్రెటరీ కిట్టు,మేడ్చల్ జిల్లా మేడ్చల్ జిల్ల ఎక్స్ జనరల్ సెక్రెటరీ బాలరాజు, కె పి హెచ్ బి డివిజన్ అధ్యక్షులు డి.రంగస్వామి,ఫతేనగర్ డివిజన్ అధ్యక్షులు బి.చందు,కూకట్పల్లి నియోజకవర్గ జనరల్ సెక్రెటరీ జె.రాజు,కూకట్పల్లి నియోజకవర్గం మహిళా జనరల్ సెక్రెటరీ సాయి ప్రణతి,మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Md Salim](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-07-at-18.53.39-1024x576.jpeg)