![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-07-at-18.39.08.jpeg)
వైఎస్ఆర్సిపి యువజన విభాగ అధ్యక్షునిగా, పడాల దుర్గా రెడ్డి
మాజీ ఎమ్మెల్యే,డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన అనపర్తి నియోజకవర్గం వై ఎస్ ఆర్ సి పి యూత్ అధ్యక్షులు ఆర్ కే దుర్గారెడ్డి
Trinethram News : అనపర్తి: ఇటీవల అనపర్తి నియోజకవర్గం వై ఎస్ ఆర్ సి పి యువజన విభాగం అధ్యక్షునిగా నియమించబడిన పడాల దుర్గారెడ్డి, ( ఆర్ కే దుర్గారెడ్డి) శుక్రవారం అనపర్తి లోని గంగిరెడ్డి నర్సింగ్ హోమ్ నందునియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ కే దుర్గారెడ్డి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిని దుస్సాలువా పూలమాలతో సత్కరించారు.
పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి యువత కీలకపాత్ర పోషించాలని యువజన విభాగాన్ని మరింత విస్తృత పరచాలని దుర్గా రెడ్డికి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి సూచించారు
ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ సి పి యువజన విభాగం నాయకులు గొడితి బాలకృష్ణ, జుత్తుక గంగన్న, కొవ్వూరి సుబ్బారెడ్డి, సత్తి వీర్రెడ్డి, జిత్తక రాజేష్, పులగం చంద్రశేఖర్ రెడ్డి, తేతలి రవి సుమంత్ రెడ్డి (సైరా) లతోపాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![YSRCP](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-07-at-18.39.08.jpeg)