TRINETHRAM NEWS

ఇసుక ట్రాక్టర్ యజమానులకు , డ్రైవర్ లకు పోలీస్ వారి సూచనలు

నగరి త్రినేత్రం న్యూస్. నగరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ల యజమానులకు మరియు డ్రైవర్లని పోలీస్ స్టేషన్ పిలిపించి వారికి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. నగరి మీదుగా కుశస్థలి నదిలో ఉన్న ఇసుకను సత్రవాడ కెవిఆర్పేట పేరని మెట్టు పాలెం ఏకాంబర కుప్పం ఏరియాలలో జనసంచారం ఉన్నచోట ప్రజలు ఉన్నచోట ట్రాక్టర్లని అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతూ ఇసుకని రవాణా చేయడం జరుగుతుంది దాని వలన మహిళలు వృద్ధులు స్కూళ్లకు వెళ్లే చిన్నపిల్లలకు భయభ్రాంతులకు లోనై అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఇందు నిమిత్తమై గౌరవ డిఎస్పి సూచనల మేరకు పై విధంగా అందరినీ సమావేశపరచి వారికి ఈ క్రింది సూచనలు చేయడం జరిగింది.

ప్రతి ట్రాక్టర్ నందు ట్రాక్టర్ యొక్క రిజిస్ట్రేషన్ పత్రాలు డ్రైవర్ యొక్క లైసెన్స్ తో పాటు కచ్చితంగా కలిగి ఉండాలి. ట్రాక్టర్లు ఇసుక కోసం వెళ్లేవారు ఉదయం 7 నుంచి 11 వరకు సాయంత్రం నాలుగు తర్వాత ట్రాఫిక్ ఉన్న పట్టణ ఏరియాలో రవాణా చేయకూడదు. ప్రతి ఒక్క ట్రాక్టర్ వారి అవసరాలకు తగ్గ విధంగా లోడ్లు మాత్రమే తోలుకోవాల్సి ఉంటుంది. తమిళనాడుకు సరఫరా చేసినట్లయితే వారి పైన కేసులు నమోదు చేసి అవసరమైతే పీడియాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతి ట్రాక్టర్ ఇసుక రవాణా చేసేవి కచ్చితంగా జిపిఎస్ పరికరాన్ని అమర్చుకోవాలి. లైసెన్స్ లేని డ్రైవర్ని అనుమతించిన ఓనర్ల పైన చర్యలు తీసుకోబడుతుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Police instructions