TRINETHRAM NEWS

“ఆదర్శ్ బ్యాంకు యొక్క 27వ వార్షికోత్సవము”
ది ఆదర్శ్ కోపరేటివ్ అర్బన్ బ్యాంకు బోయినపల్లి శాఖ ఈరోజు 06-02-2025 న వారి 27వ వార్షికోత్సవము జరిగినది. ఇందులో భాగంగా బ్రాంచి మేనేజ్మెంట్ కు చెందిన మేనేజరు కె. బ్రహ్మానందం మరియు సహాయ మేనేజర్ పి వెంకటేశం మీడియా మరియు పత్రిక విలేఖరి విలేకరులతో విలేకరులతో మాట్లాడుతూ ఆదర్శ బ్యాంకు ఇప్పటికే 1,300 కోట్ల బిజినెస్ మైలురాయిని దాటిందని మరియు
చిన్న, సన్నకారు, మధ్యతరగతి ప్రజలకు చేయూత అందించు దిశలో ముందుకు వెళ్తున్న బ్యాంకు నిరంతరం సేవలు అందించుచు ఎన్నో విధాలుగా సామాజిక స్ఫూహా కలిగిన కార్యక్రమాలు ( పిల్లలకు పొదుపు చేయుటకై కిడ్డీ బ్యాంకు వీధి నందు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి కొరకు స్వానిధి లోన్స్ రూపాయలు 10,000/- నుండి 50,000/- వరకు ) సత్వరము మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటూఎందరికో ఎన్నో విధాలుగా సేవలు అందించు బ్యాంకుగా ఆదర్శ బ్యాంకు ముందుకు వెళ్తుంది అందరూ ఇట్టి బాధ్యత కలిగిన బ్యాంకుల అభివృద్ధికి ఎంతగానో సహకరించవలసిన అవసరం ఉందని ఇందుకోసము బ్యాంక్ చైర్మన్ జి.మదన గోపాల స్వామి ఎంతో కృషి చేస్తున్నారని తెలియ పరచుచున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Adarsh ​​Bank