TRINETHRAM NEWS

జలసాల కోసం దొంగతనాన్ని వృత్తిగా మలుచుకున్న వ్యక్తి అరెస్ట్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని పట్టణం యందు గత కొంతకాలంగా తాళాలు వేసిన ఇండ్లనూ పగలగొడుతూ దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసిన గోదావరిఖని వన్ టౌన్ పోలీస్

నేరస్తుని పేరు
ఐత వెంకటేష్ S/o చంద్రయ్య
ఏజ్ 32. sc మాల.
రమేష్ నగర్

స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు
1.సంట్రో రెడ్ కలర్ కార్
2.2 మొబైల్స్
3.20000 క్యాష్
4.130 గ్రామ్స్ సిల్వర్
నేరం చేయు విధానం

గోదావరిఖని పట్టణానికి చెందిన ఐత వెంకటేష్ అనే నేరస్తుడు గత కొంతకాలంగా గోదావరిఖనిలోని తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్గా పెట్టుకొని మధ్యాహ్న సమయంలో అట్టి తాళం వేసిన ఇండ్ల పరిసర ప్రాంతాలలో రెక్కి నిర్వహించి రాత్రి సమయాల్లో అట్టి ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనాలు చేయడం వృత్తిగా పెట్టుకున్నాడు ఇట్టి దొంగిలించిన సొమ్మును సరదాల కోసం విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ ప్రాంతాల్లో తిరుగుతూ డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్న కారణంగా రామగుండం సిపి శ్రీనివాస్ ఐపీఎస్ ఐజి డిసిపి చేతన మేడం ఐపీఎస్ పెద్దపల్లి ఆదేశాలతో ఎసిపి గోదావరిఖని మడత రమేష్ సార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మూడు క్రైమ్ టీమ్లను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించే నిరంతరం పర్యవేక్షణలో నేరస్థుడు ఐత వెంకటేష్ ను క్రైమ్ టీమ్స్ పట్టుకోవడం జరిగింది.

వారి విచారణలో గత వారం రోజుల క్రితం మార్కండేయ కాలనీకి చెందిన రమేష్ అను వ్యక్తి తన బంధువులు చనిపోతే కుటుంబ సభ్యులతో ఇంటికి తాళం వేసి వెళ్లడంతో అట్టి ఇంటి తాళం పగలగొట్టి అదే రాత్రి దొంగతనం చేసి మూడు లక్షల 42 వేల రూపాయలు దొంగిలించినాడు అట్టి డబ్బులతో హైదరాబాదులో కారుకొని అట్టి కారును రిపేరు చేయించుకొని జల్సాలు చేస్తున్నాడు రెండు మొబైల్స్ కూడా కొనడం జరిగింది తన స్నేహితునికి అప్పుగా 20వేల రూపాయలు కూడా ఇచ్చినాడు ఇట్టి కారును రెండు మొబైల్స్ ను తన స్నేహితునికి అప్పుగా ఇచ్చిన 20 వేల రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. గత 15 రోజుల క్రితం అశోక్ నగర్ చెందిన పులిపాక స్వరూప ఇంట్లో దొంగతనం చేసి ఒక గ్యాస్ సిలిండర్ మరియు డబ్బులు దొంగిలించి జలసాలకు ఉపయోగించడం జరిగింది .

ఇదే విధంగా గత ఏడు నెలల క్రితం మార్కండేయ కాలనీకి చెందిన తాళం వేసిన ఒక ఇంట్లో దొంగతనం చేసి బంగారు వెండి వస్తువులు దొంగిలించినాను , గత సుమారు 11 నెలల క్రితం ప్రశాంతినగర్ కు చెందిన ఒక తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం దొంగతనం చేసి నాలుగున్నర తులాల బంగారం 16 తులాల వెండి వస్తువులను దొంగతనం చేసి వాటిని అమ్ముకొని, వచ్చిన డబ్బులను జల్సాలకు వాడుకున్నాడు ఇట్టి వ్యక్తిని టెక్నాలజీ సహాయంతో పట్టుకొని తాను దొంగిలించిన వస్తువులను కొంతవరకు రికవరీ చేయడం జరిగింది .ఇతడిని అరెస్టు చేసి జైలుకు పంపడం జరుగుతుంది.
ఇతడు గతంలో కూడా 11 దొంగతనం కేసులలో నిందితుడిగా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది
ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరపున ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా మీరు మీ ఇంటికి తాళం వేసి ఎటైనా వెళ్తున్న సందర్భంలో మీ విలువైన వస్తువులను మీ వెంట గాని, బ్యాంకు లాకర్లో కానీ పెట్టుకోవాలని అదేవిధంగా మీ ఇంటి పక్క వారికి, పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ప్రజలు ఇండ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ముఖ్యమైన కూడళ్ల వద్ద, గల్లీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కోసం తన వంతు సహకారాన్ని అందించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్టి నేరస్తుని చాకచక్యంగా మరియు టెక్నాలజీని ఉపయోగించి పట్టుకోవడంలో కృషి చేసిన సిఐ ఇంద్రసేనారెడ్డి, రవీందర్ క్రైమ్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేష్ శ్రీనివాస కానిస్టేబుల్స్ శ్రీనివాస్ వెంకటేష్ రమేష్ మధుసూదన్లను ఏసీపీ జీడీకే నగదు రివార్డు ఇచ్చి అభినందించనైనది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

theft into a profession