పెనుమూరు సి హెచ్ సి లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం
చిత్తూరు పెనుమూరు త్రినేత్రం న్యూస్. గురువారం పెనుమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల క్యాన్సర్లపై అవగాహన సదస్సు కార్యక్రమం డాక్టర్ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో జరిగింది ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమైన జీవనశైలి మరియు ముందస్తు పరీక్షల ద్వారా క్యాన్సర్ని నివారించవచ్చునని మేమున్నాము మీకేం కాదు మీ ఇంటి వద్దకు వస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ బృందానికి సహకరించాలని ఆసుపత్రికి వచ్చిన రోగులకు వివరించారు.
డాక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య వైద్య సిబ్బంది హెడ్ నర్స్ నిర్మలాదేవి మరియు సీనియర్ ఫార్మసీ ఆఫీసర్ ఇర్షాద్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App