భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా
కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ లో బాధిత మహిళలు లేదా బాలికలకు వైద్యం, కౌన్సిలింగ్, అన్ని రకాల సేవలు అందించడంతో పాటు వారికీ పోలీస్ అండగా ఉందనే మనోదైర్యం కల్పించడం కోసం ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ ప్రారంభించి సంవత్సరా కాలం అవుతున్న సందర్బంగా వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అట్టి కార్యక్రమం కు రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి హాజరై బాధితులతో మాట్లాడి వారికీ ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలు, బాలికలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. భరోసా కేంద్రాలలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు. భరోసా సహాయ కేంద్రాలు సమగ్రమైన సహాయాన్ని అందించడానికి మరియు ఆపదకు లోనైన వారికి పోలీస్ స్టేషన్లకు, ఆసుపత్రులకు దూరంగా సురక్షితమైన వాతావరణంలో చేయూత అందించడానికి ఏర్పాటు చేయబడ్డాయి. హింస మరియు లైంగిక వేధింపులకు గురైన పిల్లలు, స్త్రీలు మరల ఇటువంటి వాటి బారిన పడకుండా చూడడమే భరోసా సెంటర్ యొక్క ముఖ్య లక్ష్యం అన్నారు.
లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళాల కు లేదా బాలికలకు సంబందించిన కేసు పోలీస్ స్టేషన్ లో నమోదు కాబడిన సమయం నుండి బాధితులకు అండగా ఉంటూ వారి మానసిక పరిస్థితి గురించి తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తూ మరియు భరోసా సెంటర్ల గురించి అందరికీ అవగాహన కల్పిస్తున్న భరోసా సెంటర్ సిబ్బందిని సిపి అభినందించారు
ఈ కార్యక్రమం లో పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్., ఏసీపీ జి. కృష్ణ, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, పెద్దపల్లి ఎస్ఐ లు లక్ష్మణ్ రావు, మల్లేష్ లు, భరోసా సెంటర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App