TRINETHRAM NEWS

మహాశివరాత్రి నిర్వహణకు ప్రభుత్వ సహకారం

Trinethram News : ఈనెల 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని నిర్వహించేందుకు జిల్లాలోని దేవాలయాలకు ప్రభుత్వం నుంచి సహకారాన్ని అందిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లావ్యాప్తంగా మహాశివరాత్రి నిర్వహణ ఏర్పాట్లపై అంతర్వేది లక్ష్మీ నరసిం హస్వామి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి, మందపల్లి శనీశ్వర స్వామి, అప్పనపల్లి బాల బాలాజీ, ద్రాక్షారామ భీమేశ్వర స్వామి, కోటిపల్లి సోమేశ్వర స్వామి, అమలాపురం వెంకటేశ్వర స్వామి , పలివెల ఉమా కోప్పేశ్వర స్వామి, ర్యాలీ జగన్మో హిని కేశవ స్వామి , మురమళ్ళ వీరేశ్వర స్వామి దేవస్థానాలకు చెందిన అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్స వాలు నిర్వహించే దేవస్థానాల అధికారులు, శాంతి భద్రతలు పరిరక్షణకు అదనపు సిబ్బంది, వసతుల కల్పన వంటి సహకారం కోసం ముందుగానే ప్రతిపాదన లు పంపితే జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లను సమకూరుస్తుందన్నారు. పటిష్ట ఏర్పాట్లు నడుమ భక్తుల కు మహాశివుని దర్శన ఏర్పాట్లు చేపట్టాలన్నారు స్నాన ఘట్టాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బిఎల్ఎన్ రాజకుమారి,దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉప కమిషనర్ డిఎల్వి రమేష్, ఈవోలు చక్రధర రావు, ఏవీ దుర్గా భవాని, ముదునూరి సత్యనారాయణ రాజు, వివిధ దేవస్థానాల ఈవోలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mahashivratri