తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా చారిత్రాత్మకం.
యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జర్పుల లక్ష్మీ తిరుపతి.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతిగా రాహుల్ గాంధీ నేతృత్వంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సారథంలో తెలంగాణ రాష్ట్రం మరింత ముందడుగు వేస్తుందని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రతాప్ నగర్ గ్రామ మాజీ సర్పంచ్ జర్పుల లక్ష్మీ తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నగదును ఒక ఎకరా సాగులో ఉన్న వ్యవసాయ భూములకు రైతు భరోసానిధులను విడుదల చేశారని ఆమె తెలిపారు.
రాహుల్ గాంధీ తెలంగాణ రైతంగానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి రైతు పక్షపాతిగా రైతు భరోసాను అమలు చేసి చూపించారని ఆమె తెలిపారు.
జనవరి 26న రైతు భరోసాను ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ళను లాంచనంగా దేశ చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయలేని విధంగా అమలు చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిదే అని ఆమె తెలిపారు. నిరుపేద రైతులకు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని రైతులు భూమిలేని నిరుపేదలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆమె తెలిపారు.
విడతల వారి గా గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందని, ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఆమె తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App