![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-1.59.18-PM.jpeg)
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ నివాసం వద్ద ఇటీవలే అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన కట్కామ్ శ్రీనివాస్ కు 60,000/-, కేతావత్ మంగమ్మ కు 22,500/-,ఎండి బషీర్ కు 60,000/-ల చెక్కులు అందజేశారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…
నియోజకవర్గం ప్రజలకు సిఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం ఎంతగానో సహాయపడుతుందని కొనియాడారు..
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల సంక్షేమం కోసం ప్రజాపాలన ముందుకు వెళ్తుందాన్నారు..
అనంతరం రోజువారి కార్యచరణలో భాగంగా తన నివాసం వద్ద నియోజకవర్గం ప్రజలను కలిసారు..
ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు..
వారి సమస్యలపై సానుకూలంగా స్పందించారు..
నియోజకవర్గం ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు..
ఈ కార్యక్రమంలో ఏ జేమ్స్, అమర్ బాబు, ధరణి, మధు యాదవ్, భరత్, మోతే శీను, సంజీవ్, టైగర్ రాములు, నియోజకవర్గం ప్రజలు, నాయకులు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Kuna Srisailam Goud](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-1.59.18-PM-1024x768.jpeg)