![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-19.07.22.jpeg)
44 కార్మికుల చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకురావడానికి రద్దు చేయాలి,
నగరి త్రినేత్రం న్యూస్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతాంగం కార్మిక పేదల వ్యతిరేక బడ్జెట్ ను నిరసిస్తూ బడ్జెట్ ప్రతులను తగలబెట్టిన ఏఐటీయూసీ నాయకులు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతాంగ కార్మిక పేదల వ్యతిరేక బడ్జెట్ను దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు నగరిలో ఏఐటియుసి సీనియర్ నాయకులు వేలన్ అధ్యక్షతన బడ్జెట్ కాపీలను తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైన బడ్జెట్ గా ఉన్నది రాష్ట్రంలో ఉన్న కోట్లాదిమంది రైతులు కార్మికులు పేదలను ఆదుకునే విధంగా బడ్జెట్ లేదు.
కావున ఈరోజు జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు నగరిలో బడ్జెట్ ప్రతులను బస్టాండ్ కూడలిలో తగులు పెట్టడం జరిగింది. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను ఈరోజు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నాలుగు కోడ్ లను తీసుకొని రావడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న కార్మికుల ఉద్యోగులు అనేక పోరాటాలు చేసిన సమ్మెలు చేసిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నది. రైతన్న సమస్యలు పరిష్కరించాలని సంవత్సరాలుగా ఢిల్లీలో పోరాటం చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం రైతులని విస్మరించడం బాధాకరం ఈరోజు బడ్జెట్లో స్కీం కార్మికులకు (ఆశ అంగన్వాడి మధ్యాహ్నం భోజనం కార్మికులకు) సంబంధించి గాని నిధులు కేటాయించకపోవడం దారుణం
రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని రైతాంగం పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకించడాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు.
ఈరోజు కార్పొరేట్ సంస్థలు లక్షలాది కోట్లు బ్యాంకులో దోచుకుని విదేశాలకు వెళ్లిన వారిని పైన కేంద్ర ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోలేదు కార్పొరేట్ సంస్థలకు ఇచ్చే సబ్సిడీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య ఏఐటియుసి సీనియర్ నాయకులు వేలన్ ఆటో టాక్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు శేఖరు బాషా ఏఐటియుసి నాయకులు సతీష్ రమేష్ సత్తార్ ఏసుదాస్ చీరావుద్దీన్ చిన్న రాజ్ రాజేంద్ర నాయకులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![AITUC](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-19.07.22-1024x576.jpeg)